శాసన మండలిలో చోటుచేసుకున్న పరిమాణాలపై గవర్నర్ ... ఛైర్మన్ ఎంఏ. షరీఫ్‌తో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. గవర్నర్ ఆహ్వానం మేరకు షరీఫ్ ఆదివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వచ్చి ఆయనతో సమావేశమయ్యారు. జనవరి 22న మండలిలో ఏం జరిగింది? అని గవర్నర్ ప్రశ్నించగా.. తొలినుంచి చోటుచేసుకున్న పరిమాణాలను ఛైర్మన్ వివరించినట్లు తెలిసింది. శాసనసభ నుంచి మండలికి బిల్లులు వచ్చినప్పటినుంచి ప్రతిపక్షం 71 నిబంధన కింద నోటిసివ్వడం, అనంతరం అధికార ప్రతిపక్ష సభ్యుల వాదనలు, చర్చలను పూసగుచ్చినట్లు వివరించటంతో పాటు.. బిల్లును సెలక్టు కమిటీకి పంపాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేసినట్లు సమాచారం. శనివారం శాసనసభాపతి తమ్మినేని సీతారంతోనూ గవర్నర్ సమావేశమైనట్లు సమాచారం. శాసనసభలో ఏం జరిగిందనే వివరాలను ఆయన వాకబు చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్తోనూ గవర్నర్ తరుచూ మాట్లాడి పలు అంశాలపై వివరాలను తీసుకుంటున్నారు.
ఇదీచూడండి.నేడు మంత్రివర్గ సమావేశం... మండలి రద్దుపై తీర్మానం!