ప్రభుత్వం ఒంటెద్దు పోకడగా పాలన కొనసాగిస్తోందని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ బాబు విమర్శించారు. అందుకు వివిధ కేసుల్లో హైకోర్టు ఇస్తున్న ఉత్తర్వులు నిదర్శనమని అన్నారు. విజయవాడ భవానీపురం 40వ డివిజన్ లో ముస్లింలకు పార్టీ తరఫున రంజాన్ కానుకలు పంపిణీ చేశారు.
రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పై వైకాపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు, విశాఖలో డాక్టర్ సుధాకర్ పై దాడి సంఘటనలో సీబీఐ విచారణకు ఆదేశించడం, గ్రామ సచివాలయాలకు వైకాపా జెండా రంగులపై హైకోర్టు అభిప్రాయం ఇవన్నీ ప్రస్తుత వైకాపా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు.
ప్రజాహిత పరిపాలన చేయకుండా ఇటువంటి కక్షసాధింపు ధోరణి వైకాపా ప్రభుత్వం వెళితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయ పడ్డారు. సామాజిక మాధ్యమంలో ఓ వ్యక్తి పెట్టిన చిన్న పోస్ట్ కే ప్రభుత్వం గజగజ వణికిపోయే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: