కృష్ణా జిల్లా కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం పంచాయతీలో పెద్దింట్లమ్మ నూతన వారధి నిర్మాణ పనులు వెంటనే మొదలుపెట్టాలని తెదేపా కైకలూరు ఇంఛార్జి జయమంగళ వెంకటరమణ డిమాండ్ చేశారు. తమ హయాంలో మంజూరై మొదలు పెట్టిన వంతెన పనులను ఎందుకు ఆపారని ప్రభుత్వాన్ని నిలదీశారు. కొల్లేరు ప్రజలకు గ్రామాలలో రోడ్లు వేయాలని అన్నారు. అలాగే పెద్దింట్లమ్మ అమ్మవారి దేవాలయం వరకు మంజూరైన రోడ్డును పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి