ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు కొందరి అక్రమార్కుల కారణంగా పక్కదారి పడుతున్నాయి. అర్హులైన రైతులకు పథకాలు వర్తింపచేయటం వారికి చేయుత అందించాలన్న కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల సంకల్పానికి తూట్లు పడుతున్నాయి. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం కొన్ని గ్రామల్లో రైతు భరోసా నిధులు తమకు రాలేదని..కొందరు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటపొలాలపై ఇతరులకు డబ్బులు వచ్చాయని తెలిపారు. కౌలుకు చేసే పొలంలో కూడా, కౌలు దారుడు లేదా భూ యజమానికి కాకుండా..వేరే వారికి నిధులు చేరాయని రైతులు చెప్పారు. గత తెదేపా ప్రభుత్వం అందించిన అన్నదాత-సుఖీభవన పథకం తాలుక నిధులు కూడా తమకు రాలేదని వారు వెల్లడించారు. చివరకు స్థిరాస్థి వ్యాపారం చేసే స్థలాలను పంటపొలాలుగా చూపించి రైతు భరోసా సాయం తీసుకున్నట్లు వారు వెల్లడించారు. ఇక్కడ విధులు నిర్వహించిన వీఆర్వో, కొందరు గ్రామస్తులతో కలిసి అసలు రైతులకు మొండిచేయి చూపించారని ఆరోపించారు. కేంద్ర-రాష్ట్రప్రభుత్వాలు రైతులకు చెల్లిస్తున్న నగదును కాజేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:రైతన్నల కష్టాలు చూశాడు.. కలుపు యంత్రం తయారు చేశాడు!