కృష్ణా జిల్లా తిరువూరు మండల పరిషత్ కార్యాలయం కేంద్రంగా పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర రావు, అటెండర్ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారు. దళారీగా వ్యవహరిస్తున్న ప్రైవేటు వ్యక్తి సుభానితో కలసి కలర్ జిరాక్స్‌తో నకిలీ కూపన్లు తయారు చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇసుక రీచ్ల వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు నకిలీ కూపన్లతో ఇసుకను తరలిస్తున్న 3 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు నెలలుగా సాగుతున్న అక్రమ వ్యవహారం పోలీసుల విచారణతో వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కార్యదర్శి, అటెండరుతో పాటు మూడు ట్రాక్టర్ల డ్రైవర్లు, యజమానులను అరెస్టు చేసినట్టు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్ తెలిపారు.
ఇదీ చదవండి: