రివర్స్ టెండరింగ్‌పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలన్నీ బోగస్ అని తెలుగుదేశం పార్టీ నేత బొండా ఉమ విమర్శించారు. పనుల నాణ్యత గాలికొదిలి తక్కువ ధరకు టెండర్ ఇచ్చారని ఆరోపించారు. పోలవరం టెండరింగ్‌లో కనీసం ముగ్గురు పాల్గొనాలని... అలాంటిది ఒక్కరే పాల్గొనడమేంటని ప్రశ్నించారు. కోర్టులో ఉన్న పోలవరం అంశంపై కోట్లు మిగులుతాయని ఎలా అంటారని ప్రశ్నించారు. 'పీపీఏలపై కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చింది... అందులో పీపీఏల పునఃసమీక్ష తప్పు అని కేంద్రం ప్రస్తావించింది'' అని ఉమ చెప్పారు.
ఇదీ చూడండి: