రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి, వసతి దీవెన, ఇళ్లపట్టాలు లాంటి విప్లవాత్మకమైన పథకాలన్నీ మహిళల పేరిటే అమలు చేస్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పథకాల అమలులో మహిళా ఉద్యోగులే కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఐదో బ్లాక్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు బాసటగా నిలవాలంటూ సజ్జల పిలుపునిచ్చారు.
గతంలో లేని స్వర్ణయుగం మహిళలకు ఇప్పుడు వచ్చిందని.. పురుషులంతా తమ మనస్తత్వం మార్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సమాజ అవసరాలకు అనుగుణంగా మహిళలు పురుషులనే వ్యత్యాసం లేకుండా పనులు జరుగుతున్నాయన్నారు. మహిళా ఉద్యోగులు భవిష్యత్తులోనూ ప్రభుత్వానికి అండగా ఉండాలని అభ్యర్ధించారు.
ఇవీ చదవండి