ETV Bharat / state

గిలకలదిండి రేవు విస్తరణకు రూ.285 కోట్లు

కృష్ణా జిల్లాలోని గిలకలదిండి రేవు (ఫిషింగ్‌ హార్బర్‌) విస్తరణ పనులను రాష్ట్ర మారిటైం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఐడీసీఎల్‌) చేపట్టనుంది. జిల్లాలోని ఈ చారిత్రక రేవు పూడిపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పాటు నాబార్డు రుణంతో రేవును అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే తాజాగా రూ.285 కోట్లతో విస్తరణ ప్రాజెక్టును ప్రభుత్వం ఆమోదించింది.

gikaldindi revu
gikaldindi revu
author img

By

Published : Aug 6, 2020, 9:35 AM IST

పూడిక సమస్యకు పరిష్కారం

ప్రస్తుతం గిలకలదిండి రేవు వద్ద పడవల నిలుపుదలతో పాటు పలు వసతులు ఉన్నా మొగ పూడిపోవడంతో పడవలు రేవుకు రాలేని పరిస్థితి. మచిలీపట్నంతో పాటు నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను తదితర ప్రాంతాల మత్స్యకారులు సముద్రంపై వేట సాగించగా వచ్చిన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి అనేక అవస్థలు పడుతున్నారు. పడవలో చేపలు ఉన్నా దగ్గరున్న గిలకదిండి రేవుకు రావడానికి మార్గం లేక నిజాంపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. దూరప్రాంతాలు వెళ్లి విక్రయించాల్సి రావడంతో ఒక్కోసారి చేపలు పాడైపోవడంతో కష్టానికి ఫలితం దక్కడం లేదు. ప్రస్తుతం ఈ రేవునుంచి ఆటు, పోట్ల సమయంలోనే పడవలు సముద్రంలోనికి వెళ్లివస్తున్నాయి. దీన్ని పరిష్కరించేందుకు రేవుకు అనుసంధానంగా ఉన్న ఛానల్‌ నుంచి సముద్రం వరకు డ్రెడ్జింగ్‌ చేసి రివిట్‌వెంట్‌ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ పనులు పూర్తయితే నిరంతరం పడవలు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుంది. గిలకలదిండి రేవు విస్తరణతో ఉత్పత్తులు పెరిగి గణనీయమైన ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక సంస్థ ద్వారా పనులు

ఇప్పటివరకు మత్స్యశాఖ ద్వారా పనులు చేపట్టాలని భావించారు. మొగ విస్తరణకు కావాల్సిన 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని పోర్టుశాఖ అధికారులను మత్స్యశాఖ అధికారులు కోరారు. ఈ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో ఫిషింగ్‌ హార్బర్‌ల అభివృద్ధి పనులన్నీ ఏపీఎంఐడీసీఎల్‌ ద్వారా జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కేటాయించిన నిధుల్లో నాబార్డు ద్వారా ఎఫ్‌ఐడీఎఫ్‌ రుణం రూ.150 కోట్లు అందించనున్నారు. మిగిలిన నిధుల్లో కేంద్రప్రభుత్వం రూ.122 కోటు,్ల రాష్ట్ర ప్రభుత్వం రూ.13.561కోట్లు అందిస్తాయి. చేపలు వేలం వేసేందుకు కేంద్రాలు, అంతర్గత రహదారులు, ఐస్‌ప్లాంట్‌లు, శీతల గోదాములు నిర్మించనున్నారు. వలలు ఆరబెట్టుకునేందుకు ప్రత్యేక ప్రదేశం, మత్స్యకారులు సేదతీరేందుకు విశ్రాంతి గది, బోటు, వలలు మరమ్మతులు చేసుకునే షెడ్లు తదితర అనేక వసతులు అందుబాటులోకి వస్తాయి.

అనుమతులు మంజూరు

గిలకలదిండి హార్బర్‌ విస్తరణ, అభివృద్ధి పనులు ఏపీఎంఐడీసీఎల్‌ ద్వారా జరగనున్నాయి. ఇతర ప్రాంతాల్లోని హార్బర్‌ల పనులు కూడా ఇదే సంస్థ చేపడుతుంది. గిలకలదిండి ఫిషింగ్‌ హార్బర్‌కుకు మంజూరు చేసిన నిధుల్లో రుణానికి సంబంధించి ఇటీవల క్లియరెన్స్‌ వచ్చింది. ఇంకా కొన్నింటికి అనుమతులు మంజూరు కావాలి. అవి పూర్తికాగానే పనులు ప్రారంభం అవుతాయి. - షేక్‌లాల్‌ మహ్మద్‌, మత్స్యశాఖ జేడీ

ఇదీ చదవండి: ఆసుపత్రిలో అగ్నిప్రమాదం- 8 మంది కొవిడ్​ రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.