కృష్ణా జిల్లా పామర్రులో పద్మశ్రీ ఘంటసాల 98వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పద్మశ్రీ ఘంటసాల, ఎస్పీ బాలు స్మారక సంగీత పీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గాన గంధర్వుడు ఘంటసాల పాటలను కళాకారులు ఆలపించారు.
నటరాజ నృత్య నికేతన్ విద్యార్ధులతో నిర్వహించిన నృత్య ప్రదర్శన.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పామర్రు ఎన్టీఆర్ సర్కిల్లో.. ది పామర్రు కళాపరిషత్ ఆధ్వర్యంలోనూ ఘంటసాల జయంతి ఉత్సవాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల బసవయ్య భగవద్గీత ఉపన్యాసం ప్రజలను అలరించింది.
ఇదీ చదవండి: