రామవరప్పాడుకు చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు నభిగాని కొండ ఇంటిపై అర్ధరాత్రి కొంత మంది రాళ్ల దాడి చేశారని పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మెుదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం కృషి చేశామని నభిగాని కొండ అన్నారు. దుట్టా, యార్లగడ్డ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసేందుకు కష్టపడి పనిచేశామని తెలిపారు. వైకాపా కండువా కప్పుకోకుండా పార్టీలో పెత్తనం చెలాయిస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని వంశీ వర్గీయులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనివ్వకుండా చేస్తున్నారని ఆరోపించారు. వంశీ వర్గం నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌కు అడ్డుపడ్డామనే కక్షతో గత రాత్రి కొంత మంది తమ ఇంటి పై దాడి చేశారని కొండ తెలిపారు. కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. అర్ధరాత్రి సమయంలో చేసిన దాడిపై పడమట పోలీసులకు,పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ప్రారంభం.. 23 వరకు పరీక్షలు