మత్స్యకార భరోసా పేరుతో జగన్ సర్కార్ మత్స్యకారులకు సంక్షేమ పథకాలన్నీ దూరం చేస్తోందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. షరతులతో కూడిన గోరంత సాయానికి కొండంత ప్రచారం చేసుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు.
'వయోపరిమితి పెంచి ద్రోహం చేశారు'
ఏ ఒక్క పథకం ద్వారా లబ్ది పొందినా మత్స్యకార భరోసా దూరం చేయటంతో పాటు వయోపరిమితిని 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించిన గంగపుత్రుడి ధృవీకరణ పత్రాల జారీలోనూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనంతా మాటల్లో మోసం, అంకెలతో ద్రోహమని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి : జగన్.. టీకాల సరఫరాపై ప్రధానిని ఎందుకు ప్రశ్నించరు..? జైరామ్ రమేశ్