ఆమె శతజయంతి సందర్భంగా, ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ మాతాజీ నిర్మలాదేవి జీవిత విశేషాలను సహజయోగ, హైదరాబాద్ విభాగంలో పనిచేస్తున్న సుప్రజా తంగ మీడియాతో పంచుకున్నారు.
మానవాళి సౌభాగ్యం కోసం, సంక్షేమం కోసం నిస్వార్థంగా దేశవిదేశాలలో పర్యటించి అహర్నిశలూ తన వంతునిస్వార్ధ సహాయ సహకారాలు అందిస్తున్న మానవతావాది, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా మూర్తీభవించిన ఆదర్శ మహిళ, సహజయోగ సృష్టి కర్త శ్రీమతి నిర్మలా శ్రీవాత్సవ స్వాతంత్ర పోరాటంలో తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన తల్లితండ్రులకు ఒక కూతురుగా, స్వాతంత్ర పోరాటంలో యుక్త వయస్సులోనే చురుకుగా పాల్గొన్న సోదరిగా, అత్యున్నతమైన పదవులలో ఉన్న భర్తకు భార్యగా, తన సంతానానికి అమ్మగా,ఒక అమ్మమ్మగా తన భాద్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. 1970 సం. లో "సహజయోగ" స్థాపించి తన ఆధ్యాత్మిక జీవన యాత్ర మొదలు పెట్టారు. అందుకే శ్రీ మాతాజీ నిర్మలా దేవిగా ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతున్నారు.
ఎలాంటి రుసుము తీసుకోకుండానే, పేద, ధనిక అనే తేడాలు లేకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సంస్థల స్థాపన ద్వారా ‘విశ్వ నిర్మలధర్మసంస్థాపన’ కోసం పనిచేశారు. ప్రతిఫలాపేక్ష, స్వార్థ చింతన లేకుండా ‘సహజయోగ’ను విశ్వవ్యాప్తం చేశారు. సమస్త మానవాళిలో పరస్పర ప్రేమానురాగాలు, ఆప్యాయత, సౌభ్రాతృత్వం వంటివి అవసరమని ఇందుకోసం శాంతి, సామరస్యంతో కూడిన సమాజం అవసరం అని, అందుకు సహజయోగమే శరణ్యమని మనసా వాచా కర్మణా నమ్మి, చేసి చూపించిన ఆదర్శ గురువుగా నిలిచారు.
ఉపన్యాసాల కోసమని లేక సాధన కోసమని లేక సభ్యత్వ రుసుము అని ఎవరిని ఏమీ అడగకుండా ధనార్జన, ధనాపేక్ష లేకుండా స్వంత సమయాన్ని, ధనాన్ని వెచ్చించి ఒక స్త్రీ మూర్తిగా గ్రామాలలో కాలినడకన, ఎడ్ల బండి మీద అహర్నిశలు తిరిగి ఈ సహజయోగ పరిజ్ఞానాన్ని విశ్వ నిర్మల ధర్మంగా సుమారు 120 దేశాలలో జాతి, మత, కుల, వర్ణ వివక్షతలకు అతీతంగా ప్రచారంచేసి వ్యాపింపచేసి, స్థిరపరిచారు. ప్రపంచ ఆధ్యాత్మిక ప్రచార చరిత్రలో ఇదొక అపురూప ఘట్టం. 1970 సం. లో "సహజయోగ" స్థాపించి తన ఆధ్యాత్మిక జీవన యాత్ర మొదలు పెట్టారు. అందుకే శ్రీ మాతాజీ నిర్మలా దేవిగా ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఎన్నో సంస్థలలో పనిచేసే ఉద్యోగినులు, విద్యార్ధులు, గృహిణులు అన్ని రంగాలలోని మహిళలు, సహజ యోగ సాధన ద్వారా తమ తమ శారీరిక, మానసిక, భావోద్వేగ సమస్యల నుండి స్వాంతన పొందుతున్నారు. సహజ యోగ సాధన గురించి వాటి ప్రయోజనం గురించి ఉచితంగా 8988982200 నెంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.