లాక్డౌన్తో ఇబ్బందులు పడుతున్న ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య 12 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు అందించాలని, అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలని, చంద్రన్న బీమాను పునరుద్ధరించాలని కోరారు.
లాక్డౌన్లో అత్యవసర సేవలందిస్తున్న పోలీసు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్లను అందించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ రావు 73 వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: