విశాఖలో డాక్టర్ సుధాకర్‌పై తీసుకున్న చర్యలకు నిరసనగా... మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మౌన దీక్ష చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా... నేతలు పిల్లి మాణిక్య రావు, మ్యానీ , కిరణ్, దయారత్నంలతో కలిసి మౌన దీక్ష చేశారు. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వివక్షను అరికట్టాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు హేయమని ఆనంద్‌బాబు మండిపడ్డారు. వైద్యుడు చేసిన తప్పు మాస్కులు అడగడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడమేనా అని నిలదీశారు. ఇది పోలీసులు చేసిన దుశ్చర్య కాదని.. ప్రభుత్వమే చేయించిన అమానుష చర్య అని ధ్వజమెత్తారు. మానవ హక్కుల సంఘాలు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు.
ఇదీ చదవండి: