బాధ్యతారాహిత్యానికి వైకాపా నేతలు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. సరిహద్దుల్లోని సామాన్యులను అనుమతించని అధికారులు..వైకాపా నేతలన ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైకాపా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ నుంచి, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ కర్ణాటక నుంచి నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు.
లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వైకాపా నేతలపై కేసులు పెట్టాలి - మాజీ మంత్రి జవహర్ వార్తలు
రాష్ట్రంలో లాక్‌డౌన్ అమలు తీరుపై మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. అధికార పార్టీకో న్యాయం, సామాన్యులకు మరో న్యాయంలా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారని ఆరోపించారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వైకాపా నేతలపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
బాధ్యతారాహిత్యానికి వైకాపా నేతలు బ్రాండ్ అంబాసిడర్‌లా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. సరిహద్దుల్లోని సామాన్యులను అనుమతించని అధికారులు..వైకాపా నేతలన ఎలా అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైకాపా నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ నుంచి, కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ కర్ణాటక నుంచి నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలోకి ప్రవేశించారని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: విజయవాడలో పకడ్బందీగా లాక్‌డౌన్ నిబంధనల అమలు