రాష్ట్రంలో దేవుడి పాలనకు బదులుగా దెయ్యాల పాలన జరుగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని దేవినేని ఆక్షేపించారు. రాష్ట్రంలో జరిగిన 140 దేవాలయాల ధ్వంసంపై సీఎం స్పందన కోసం ప్రజలు ఎదురు చూస్తుంటే.. మంత్రి బొత్సతో చిలకపలుకులు పలికించారని ఆరోపించారు. సీఎం, 5 మంది ఉపముఖ్య మంత్రులు, దేవాదాయశాఖ మంత్రిని కాదని బొత్స మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.
తిరుపతి ఎన్నికల వ్యూహం కోసం ప్రశాంత్ కిశోర్‌తో మూడు గంటల సమయం కేటాయించిన సీఎంకు దేవాలయాలు, విగ్రహాల ధ్వంసంపై మాట్లాడడానికి సమయం లేకపోవడం బాధాకరమని దేవినేని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ అసమర్థ వైఖరివల్లే ప్రభుత్వ వ్యవస్థలకు పక్షవాతం వచ్చిందని, ట్రంప్‌కు పట్టిన గతే జగన్‌కూ పడుతుందని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: