రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను బ్రష్టు పట్టిస్తోందని విమర్శించారు. తెదేపా హయాంలో అమలైన అనేక విద్యా పథకాలను నిలిపివేశారని మండిపడ్డారు. విదేశీ విద్యా నిధి పథకం ఆపేయడంతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారన్నారు. బోధనా రుసుముల చెల్లింపు, ఉపకార వేతనాలకు ఈ ప్రభుత్వం మంగళం పాడిందన్నారు. ఎన్నికల ముందు వైకాపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదన్నారు. విద్యావ్యవస్థ బలోపేతానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. జగన్ చర్యలతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఇదీ చదవండి