వైకాపా అరాచకాలను కోర్టులు ప్రశ్నిస్తే తప్పేంటని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. అవినీతి కేసుల్లో ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి... కోర్టులను విమర్శించడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కుంటల్లో, ఆవ భూముల్లో పేదలకు స్థలాలు కేటాయిస్తే ఇదేమి విధానమని ప్రశ్నిస్తే కోర్టులను విమర్శించడమేంటని నిలదీశారు.
వైకాపా పాలనలో రాష్ట్రంలో అశాంతి నెలకొంది. పెద్ద ఎత్తున దేవాలయాలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. భూ కుంభకోణం, ఇసుక, మద్యం మాఫియా రెచ్చిపోతున్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టే పనులు కొందరికే దక్కేలా టెండర్లు వేశారు. విజయసాయిరెడ్డి నీతిపరుడైతే తన అవినీతి కేసులను త్వరగా విచారణ చేయాలని అడగాలి. విశాఖ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి. ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడును 73 రోజులు జైల్లో ఉంచారు. మరి ఏ3గా ఉన్న ప్రమోద్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు. మరోవైపు 278 రోజులుగా రాజధాని రైతులు దీక్షలు చేస్తుంటే వారిని పట్టించుకోవడం లేదు. ప్రాథమిక హక్కులు, రాజ్యాంగాన్ని వైకాపా ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది- ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ మంత్రి