విజయవాడ దేవినగర్లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం ప్రారంభించారు ఓ ముఠా. బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన యువతికి కోల్కతాలో ప్రియా అనే మహిళ పరిచయం అయ్యింది. ఆమెను వ్యభిచార వృత్తిలోకి దించి, కొంతకాలం హైదరాబాద్లో ఉంచింది. అక్కడినుంచి విజయవాడ తీసుకువచ్చి ఆమెకు నెలకు రూ.50వేలు ఇచ్చేటట్లు భేరం కుదుర్చుకున్నారు. ఇలా సాగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు విజయవాడలోని దేవినగర్ ఇంట్లో దాడి చేశారు. ఆ సమయంలో విదేశీ యువతితో పాటు ఇద్దరు యువకులు దొరికిపోగా నిర్వహకురాలు, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ వృత్తికి సహకరిస్తున్న మహేష్, ప్రసాద్ రెడ్డిలను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.
ఇదీ చూడండి