ETV Bharat / state

వరద నీరు సముద్రం వద్దంటోంది.. ఆ గ్రామాలకు గండమైంది!

ఆ గ్రామాలకు ఒకవైపు సముద్రం... మూడు వైపులా... కృష్ణానది. తాగు, సాగునీటికి కృష్ణానది గర్భం నుంచి పైప్ లైన్ వేసుకుని వచ్చిన నీటిని చెరువులో నింపుకొంటారు. అవసరాలు తీర్చుకుంటారు. తాజాగా కృష్ణా నది వరద నీటితో ఆ గ్రామలు ముంపునకు గురయ్యాయి.

వరద నీరు సముద్రం వద్దంటోంది.. ఆ గ్రామాలకు గండమైంది!
వరద నీరు సముద్రం వద్దంటోంది.. ఆ గ్రామాలకు గండమైంది!
author img

By

Published : Oct 17, 2020, 8:49 AM IST

కృష్ణా జిల్లా, నాగాయలంక మండలం, ఎదురుమొండి దీవులు అనేవి.. కృష్ణానది మధ్యలో ఉన్న గ్రామాలు. ఎదురుమొండి, నాచుగుంట , బ్రహ్మయ్యగారిమూల, జింక పాలెం, ఎసుపురం, కృష్ణాపురం, గొల్లమంద, కృష్ణానది ఇంకో పాయ దాటితే ఈలచెట్లదిబ్బ అనే గ్రామాలు ఉన్నాయి. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వేట పై ఆధారపడి జీవనం సాగిస్తారు. ఈ దీవుల్లో సుమారు 2 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. కృష్ణానది గరభం నుంచి పైప్ ద్వారా వచ్చిన నీరు చెరువులో పట్టుకుని ఆ నీటినే తాగు నీరు, సాగునీరు అవసరాలకు వాడుకుంటారు. ఈ నీటితో సుమారు 3 వేల ఎకరాల్లో వరి పంటలు, 2 వేల ఎకరాల్లో రొయ్యలు, పితల చెరువులు సాగుచేస్తారు.

ఇక్కడి ప్రజలు కృష్ణానది దాటి బయటకు రావాలంటే ఎదురుమొండి-ఎటిమోగ మధ్య పడవలు లేదా పంటు ద్వారా మాత్రమే ఇవతలి ఒడ్డుకు చేరుకుంటారు. కృష్ణానదికి ఎంత వరద నీరు విడుదల చేసినా.. పక్కనే సముద్రం ఉండటం వలన నదికి కేవలం పది అడుగుల ఎత్తులో ఉన్నా.. ఈ గ్రామాల్లోకి ఎక్కువగా వరద నీరు చేరదు. కానీ ఈసారి సముద్రం ఆటు పోటుల వలన వరద నీరు సముద్రంలోకి వెళ్లడం లేదు. ఈ కారణంగా గ్రామాలను వరద నీరు ముంచింది. వరి పొలాలు మరియు రొయ్యల చెరువులు సైతం వరదనీటిలో కొట్టుకుపోయాయి. సహాయక చర్యలు చేయటానికి సైతం ఈ గ్రామానికి చేరుకోవాలంటే చాలా ఇబ్బందే ఉంటుంది.

గ్రామంలో వెంటనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని బాధితులకు ఆహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు మునిగిపోయిన వరి పంటలు నమోదు చేసుకుని పరిహారం ఇప్పించాలని, పడిపోయిన నివాస గృహాలకు ఆర్థిక సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: మొదట్లో అబ్బాయిలు సున్నితంగా ఉండి... తర్వాత ముసుగు తొలగిస్తారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.