ETV Bharat / state

తగ్గని వరదలు.. ఇబ్బందుల్లో జనాలు - కృష్ణా జిల్లాలో వరద అప్​డేట్ న్యూస్

కృష్ణా జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల పంటపొలాలు నీటమునిగాయి. ఓ చోట కోళ్ల షెడ్డులోకి వరద నీరు వెళ్లటంతో వేల సంఖ్యలో కోడిపిల్లలు మృతి చెందాయి. వరద ప్రభావంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నది పరీవాహక ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

flood effect in krishna district
కృష్ణా వరదలు
author img

By

Published : Oct 14, 2020, 3:12 PM IST

  • విజయవాడలో..

విజయవాడలో కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని ఆంధ్ర లయోలా కళాశాల చెరువును తలపిస్తుంది. దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాల ప్రాంగణం మొత్తం జలమయం అయ్యింది . హాస్టల్ బ్లాక్​లు,తరగతి గదులు నిర్వహించే భవనాలు,క్రీడా ప్రాంగణాల్లో వర్షం నీరు నిలిచిపోయింది.

  • విసన్నపేట మండలంలో..

విస్సన్నపేట మండలం చండ్రుపట్ల వద్ద రేగతివాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. తిరువూరు - విస్సన్నపేట మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మైలవరం మండలం కొత్తగూడెం వద్ద కట్టు కాలువ తెగటంతో, సమీప పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వైరా కట్లేరుకు భారీగా వరద నీరు పోటెత్తటంతో సమీప గ్రామాలైన పల్లంపల్లి, వెల్లంకి లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వీరులపాడు మండలంలో వరిపంట పొలాలు నీట మునిగినాయి.

  • చందర్లపాడు మండలంలో...

చందర్లపాడు మండలం చింతలపాడు, తోటరావులపాడు గ్రామాలలో మునియేరు వరద కారణంగా పంటలు నీట మునిగాయి. 400 ఏకరాల్లో వరిపంట రెండు రోజులుగా నీటిలో మునిగి వుంది. వరద పెరుగుతున్నకారణంగా మరింత పంటలు మునిగే పరిస్థితులు ఉన్నాయి.

  • చాట్రాయి మండలంలో...

చాట్రాయి మండలం సోమవారం గ్రామంలో కోళ్ల షెడ్డుల్లోకి భారీగా వర్షపు నీరు చేరి... 5 వేల కోడిపిల్లలు మృత్యువాత పడ్డాయి. లక్షల పెట్టుబడి పెట్టమానీ.. మెుత్తం నష్టపోయామని పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదుకొని.. పరిహారం అందించాలని రైతులు వేడుకుంటున్నారు.

  • ఇబ్రహీంపట్నం మండలంలో..

ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు వద్ద బుడమేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన పైనుంచి ఇప్పటికే వరద నీరు ప్రవహిస్తుంది. వర్షం మరింత పెరిగితే.. ఒక అడుగునీరు ఎక్కువ అయినా, ఈలప్రోలుకు రాకపోకలు నిలిచిపోతాయి. వంతెన శిథిలావస్థకు చేరుకోవటంతో.. వరద ప్రవాహ వేగానికి కూలిపోతుందేమోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • జగ్గయ్యపేటలో..

జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో కృష్ణ, మున్నేరు నదుల్లో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి 5.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో రావిరాల, ముక్త్యాల, వేదాద్రి వద్ద నీటిమట్టాలు పెరిగాయి. ముక్త్యాల చంద్రమ్మకయ్య వద్ద రోడ్డుపైకి కృష్ణా నది నీరు చేరటంతో.. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేదాద్రి వద్ద పుష్కర ఘాట్​లు పూర్తిగా మునిగిపోయాయి. మున్నేరు నుంచి 50వేల క్యూసెక్కుల వరద కృష్ణానదికి చేరుతోంది. వత్సవాయి మండలం లింగాల వంతెనపై నుంచి రెండడుగుల వరద నీరు ప్రవహిస్తుంది. తెలంగాణకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెనుగంచిప్రోలు వద్ద వంతెనను తాకుతూ మున్నేరు వరద ప్రవహిస్తోంది. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని ఆలూరుపాడు, ముచ్చింతల, అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, సుబ్బయ్య గూడెం, శనగపాడు వద్ద వాగుల్లో నీటి ఉద్ధృతి కొనసాగుతోంది. వేల ఎకరాలు ఇంకా ముంపు నుంచి బయటపడలేదు.

ఇదీ చదవండి: కరెంటు స్థంభాన్ని ఢీకొన్న కారు.. భారీగా గంజాయి లభ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.