ప్రకాశం బ్యారేజీకి వరద భారీగా పెరగటంతో... 70 గేట్లు ఎత్తి కిందకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలో దిగువన ఉన్న రాణిగారితోట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్, రణవీర్ నగర్, బాలాజీ నగర్, యనమల కుదురు, తదితర ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. రాత్రికి రాత్రే వరద ఇళ్లల్లోకి వచ్చేసిందనీ... సామాన్లు సర్దుకునే లోపే ధాన్యం, సహా పలు వస్తువులు తడిసి ముద్దయ్యాయనీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
వరుసగా కృష్ణా నదికి వరద వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. వరద ముంచెత్తి బాధపడుతున్న తమను పరామర్శించేందుకు ఒక్క నాయకుడైనా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరద వచ్చిన ప్రతిసారి పరిహారం వస్తుందని చెప్తారనీ.. చివరకు వచ్చేసరికి మునుగుతున్నామన్నారు. పరామర్శించాల్సిన వారే ఇప్పుడు బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: