ETV Bharat / state

వందే భారత్ మిషన్​: గన్నవరం చేరుకున్న ప్రవాసాంధ్రులు

వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా లాక్ డౌన్​తో దేశవిదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది. కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో ఏపీఎన్​ఆర్టీ... ప్రవాసాంధ్రులను రాష్ట్రానికి తీసుకువస్తోంది. ఇందులో భాగంగనే పలు దేశాల నుంచి కొన్ని విమానాలు గన్నవరం విమానాశ్రయం చేరుకున్నాయి.

author img

By

Published : May 21, 2020, 3:51 PM IST

flights have reached to gannavaram airport from other countries after lockdown relaxations
గన్నవరం చేరుకున్న ప్రవాసాంధ్రలు
గన్నవరం చేరుకున్న ప్రవాసాంధ్రులు

లాక్​డౌన్ కారణంగా రెండు నెలల అనంతరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి... లండన్, జెడ్డా నుంచి ప్రయాణికుల విమానాలు చేరుకున్నాయి. లండన్ నుంచి 145 మంది ప్రయాణికులు రాగా... జెడ్డా నుంచి 78 మంది ప్రయాణికులు రాష్ట్రానికి చేరుకున్నారు. వీరందరినీ వైద్య పరీక్షల అనంతరం అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

తొలిదశ...
వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా తొలి దశలో రాష్ట్రానికి విదేశాల నుంచి ఎలాంటి విమాన సర్వీసులు నడపలేదు. తొలిదశలో విదేశాల నుంచి వచ్చే వారిలో కేవలం 16 మంది మాత్రమే రాష్ట్రానికి చెందిన వారు ఉండగా... వారి కోసం ప్రత్యేకంగా విమానం నడిపేందుకు ఎయిరిండియా అంగీకరించకపోవడంతో వారందరిని హైదరాబాద్ తరలించి అక్కడినుంచి ప్రత్యేక బస్సుల్లో రాష్ట్రానికి తీసుకొచ్చారు.

రెండో దశ...
రెండో దశలో మొత్తం 13 విమానాలు ఉండగా... వాటిలో రెండు విమానాలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నాయి. లండన్ నుంచి 145 మందితో కూడిన ఎయిరిండియా విమానం, సౌదీ అరేబియాలోని జెడ్డా నుంచి ఈ విమానం 142 మంది ప్రయాణికులతో ఇక్కడకు చేరుకోగా... సౌదీ నుంచి వచ్చిన విమానంలో 78మంది రాష్ట్రానికి చెందిన వారు కాగా మిగిలిన 64 మంది తెలంగాణకు చెందిన వారున్నారు. వీరందరికీ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించిన అధికారులు...అనంతరం వారిని బస్సుల్లో క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.

విమానాశ్రయంలో ప్రయాణికుల రాక దగ్గరి నుంచి వారికి స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్ కేంద్రాలకు పంపడం వరకు అన్ని ఏర్పాట్లను నూజివీడు సబ్ కలెక్టర్ స్వప్నిల్ దినకర్, విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదన రావు, ఏపీఎన్నార్టీ ఛైర్మన్ వెంకట్ పర్యవేక్షించారు.

ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలు
ప్రవాసాంధ్రుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఉచిత, నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడలోని ప్రముఖ హోటల్స్​లో నగదు చెల్లింపు క్వారంటైన్ కేంద్రాలుగా గుర్తించారు. కేటగిరీ-1 కేంద్రాలకు 14 రోజులకు గాను రూ.35 వేలు, కేటగిరి-2 కి రూ.28 వేల చొప్పున ధరలు నిర్ణయించారు.

ఇదీ చదవండి:

రాయితీ టికెట్లను తాత్కాలికంగా నిలిపివేసిన ఆర్టీసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.