ETV Bharat / state

'కక్షతోనే కొల్లు రవీంద్రను హత్య కేసులో ఇరికించారు'

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కక్షతోనే హత్య కేసులో ఇరికించారని రాష్ట్ర మత్స్యకారుల 13 ఉపకులాల ఐక్యవేదిక ఆరోపించింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపింది.

Fishermen protest against the arrest of Kollu Ravindra
కొల్లు రవీంద్ర అరెస్ట్​ను నిరసిస్తూ...మత్స్యకారులు నిరసన
author img

By

Published : Jul 16, 2020, 6:29 PM IST

రాజకీయంగా ఎదుగుతున్న బీసీ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కక్షతోనే హత్యకేసులో ఇరికించారని రాష్ట్ర మత్స్యకారుల 13 ఉపకులాల ఐక్యవేదిక ఆరోపించింది. ఆయన అరెస్ట్​ను నిరసిస్తూ విజయవాడలో నిరసన తెలిపింది. హత్య కేసుపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించి న్యాయం చేకూర్చాలని విజ్ఞప్తి చేసింది.

మచిలీపట్నంలో జరిగిన భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను రాజకీయ కక్షతోనే ఇరికించారని... ఎటువంటి నోటీసు జారీ చేయకుండా మంత్రి పేర్ని నాని ప్రోద్బలంతోనే అక్రమ అరెస్టు జరిగిందని ఐక్యవేదిక కడప అధ్యక్షుడు యాదగిరి రాంప్రసాద్ ఆరోపించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 2,593 కరోనా కేసులు.. 24 గంటల్లో 40 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.