తిరుపతి లోకసభ వైకాపా అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని కించపరుస్తూ పోస్ట్ పెట్టిన వారిపై విజయవాడ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ ఏర్పడిన తరువాత తొలికేసు ఇదే కావటం విశేషం. తెదేపా ఫేస్బుక్ పేజీతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ గురుమూర్తిని కించపరుస్తూ కొంత మంది ట్రోల్ చేస్తున్నారంటూ వైకాపా ఎంపీ నందిగం సురేష్ , ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున , కె . అనిల్ కుమార్‌లు డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను శుక్రవారం కలుసుకుని ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన ఈ కేసును విచారణ నిమిత్తం విజయవాడ పోలీస్ కమిషనర్ బి . శ్రీనివాసులుకు డీజీపీ పంపించారు. సీపీ ఆదేశాల మేరకు సైబర్ క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఐపీ చిరునామాల ఆధారంగా సైబర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి. తిరుపతి ఉపపోరు: ఈసీకి తెదేపా లేఖ.. వైకాపాపై ఫిర్యాదు చేసిన అంశాలివే..!