విజయవాడ కనకదుర్గ ఆలయంలోని లడ్డూ తయారీ కేంద్రంలో గ్యాస్ పొయ్యి పేలింది. లడ్డూ తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పొయ్యి పేలడంతో కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో దుర్గ అనే కార్మికురాలికి స్వల్ప గాయాలయ్యాయి.
ఈవో సురేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్యాస్ పొయ్యి పైపు లీక్ అవడంతో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగిందని.. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఈవో తెలిపారు. గాయపడిన మహిళకు ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె తిరిగి విధుల్లో పాల్గొన్నారని, ఎటువంటి నష్టం కానీ జరగలేదన్నారు.
ఇదీ చదవండి: విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి