గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ తప్పిదంతో మెడికల్ సీట్లు కోల్పోయిన ఫాతిమా కళాశాల విద్యార్థులు విజయవాడలో సమావేశమయ్యారు. సీట్లు కోల్పోయిన విద్యార్థులు ఏ రాష్ట్రంలో చదువుకున్నా తాను చదివిస్తానని అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీతో పక్క రాష్ట్రాల్లో సుమారు 100 విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నామని బాధితులు పేర్కొన్నారు.
అప్పటి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఒక సంవత్సరం ఫీజును రీయంబర్స్ చేసిందన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఫాతిమా కళాశాల విద్యార్థులకు పూర్తిగా న్యాయం చేస్తామని సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు రీయంబర్స్ చేయాలనీ బాధిత విద్యాార్థులు కోరారు. ఇప్పటికే లక్షల రూపాయలు నష్టపోయామని.. తక్షణమే తమ ఫీజుకు సంబంధించిన నిధులను విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి : వైకాపాది ప్రజాసంకల్ప యాత్ర కాదు.. ప్రజా వంచన యాత్ర : జనసేన