కృష్ణాజిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, కంచికచర్ల మార్కెట్ యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో.. నాణ్యత లేదని సీసీఐ బయ్యర్లు పత్తి కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన పత్తిని.. ధర నిర్ణయించకుండానే బయ్యర్లు తిరస్కరిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని నాణ్యత సక్రమంగా లేదని కొనుగోలు చేయడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి నాణ్యత దెబ్బతిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం వెంటనే పత్తి మొత్తం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
నందిగామ మార్కెట్ కు 1000 బస్తాల పత్తిని రైతులు తీసుకురాగా కేవలం వంద క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. మిగిలిన మొత్తాన్ని తిరస్కరించారు. బహిరంగా మార్కెట్ లో క్వింటా ధర రూ.5000 లోపే ఉండగా సీసీఐ మద్దతు ధర క్వింటాకు రూ,5825 ఉంది. దీంతో రైతులు ఆశగా మార్కెట్ యార్డ్‌కు తీసుకెళ్లగా...సీసీఐ మాత్రం నిబంధనల ప్రకారం నాణ్యత ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి