ETV Bharat / state

విరబూస్తున్న మల్లెలు.. రైతులకందని ఆదాయ పరిమళాలు

Jasmine farmers : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని రైతులు ప్రధానంగా మల్లెపూల సాగుపై ఆధారపడ్డారు. మూడు సంవత్సరాలుగా కరోనా కారణంగా పువ్వుల అమ్మకాలు తగ్గడంతో కౌలు రైతులు చితికిపోయారు. ఈ ఏడాది అమ్మకాలు కొంతమేర పుంజుకున్నా.. ఆశించిన లాభాల్లేవని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం ఎరువులు, పురుగు మందులు ధరలు విపరీతంగా పెంచిందని ఆవేదన చెందుతున్నారు.

మల్లెపూల సాగు
మల్లెపూల సాగు
author img

By

Published : Feb 25, 2023, 4:40 PM IST

Jasmine farmers : ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం నియోజకవర్గంలో సుమారు 200ఎకరాల్లో రైతులు మల్లెపువ్వులు సాగు చేస్తున్నారు. ధరల్లో హెచ్చుతగ్గులు సాగుదారులను నష్టాల్లోకి నెడుతున్నాయి. రోజుకో రేటుకి మల్లెపూలు అమ్ముడుపోతున్నాయి. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మైలవరం నియోజక వర్గంలో చండ్రగూడెం, మురుసుపల్లె, పుల్లూరు, కొత్తగుడెం, బూడవ, రామచంద్రాపురం, పొందుగుల, వెల్వడం తదితర గ్రామాల రైతులు ప్రధాన పంటగా మల్లెపూలు సాగు చేస్తారు. ఈ రైతులంతా చండ్రగూడెంలోని ఓ ఆలయంలో నిర్వహిస్తున్న మార్కెట్ యార్డ్ కి తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పూలను హైదరాబాద్, విజయవాడ, ఏలూరు, కోదాడ, రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తారు. హైదరాబాద్ కు రోజూ సుమారు 3 నుంచి 4 టన్నుల మల్లెపూలు సరఫరా చేస్తామని వ్యాపారులు, మల్లెపూలు సాగుచేస్తున్న రైతులు చెబుతున్నారు.

మల్లెపూల సాగు

ధరలు రెట్టింపయ్యాయి... గతంలో కూలీ రేట్లు తక్కువగా ఉండేవని... ప్రస్తుతం ఒక మహిళకు మూడు వందల రూపాయలు చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ఇతర పంటలు సాగు చేస్తున్న వారికి సబ్సిడీ పై ఎరువులు, పురుగుమందులను సరఫరా చేస్తున్న ప్రభుత్వం.. తమకి ఎందుకు అందజేయడం లేదని మల్లెపూల సాగుదారులు, కౌలు రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎరువులు, పురుగుమందుల ధరలు రెట్టింపయ్యాని ఆవేదన చెందుతున్నారు.

గిట్టుబాటు కావడం లేదు.. కూలీలు, ఎరువులు, పురుగుమందులకు పెట్టిన పెట్టుబడి మినహాయిస్తే మల్లెపూల సాగు గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం కిలో మల్లెపువ్వులు రెండు వందల నుంచి 5వందలకు అమ్ముతున్నామని రైతులు చెబుతున్నారు. డిసెంబర్, జనవరి నెలల్లో మల్లెపూల దిగుబడి తక్కువగా ఉండడంతో రూ.1200కి అమ్మగా.. దిగుబడి పెరగంతో ప్రస్తుతం రెండు వందల నుంచి ఐదు వందలకు అమ్ముతున్నామని సాగుదారులు చెబుతున్నారు. గతం కంటే పూల ధర పెరిగినా పెట్టుబడి కూడా పెరిందని రైతులు చెబుతున్నారు. గతం కంటే ధర బాగుందని వ్యాపారులు చెబుతున్నారు. విజయవాడలోని కాళేశ్వరం మార్కెట్ లో తాము మల్లెపూలు అమ్ముకోవడానికి షాపు కేటాయించాలని వ్యాపారులు కోరుతున్నారు.

ధరల్లో తేడాలు.. కౌలు రైతుల పరిస్థితి దుర్భరంగా ఉంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా కౌలు ధరలున్నాయి. ఎకరాకి లక్ష రూపాయల నుంచి 30 వేల రూపాయలు కౌలు చెల్లిస్తున్నాం. పెట్టిన పెట్టుబడి, కౌలు తీసేస్తే ఎకరా మల్లెపూల సాగుకి సంవత్సరానికి ఇరవై వేల నుంచి 40వేలు మాత్రమే మిగులుతున్నాయని మల్లెపూలు సాగు చేస్తున్న కౌలు రైతులు చెబుతున్నారు. మల్లెపూల ధర మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కోలా ఉండటమే అందుకు కారణమని చెప్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.