కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో రైతులను పాముకాటు ఘటనలు బెంబేలెత్తిస్తున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే సుమారు నలభై మంది రైతులు పాముకాటుకు గురయ్యారు. వర్షాకాలం నేపథ్యంలో.. పొలం పనులకు వెళ్తున్న రైతులు పాముకాటుకు గురతుండంపై.. బాధిత ప్రాంతాల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రైతులు, రైతు కూలీలు పాముకాటుకు గురైతే ఆందోళన చెందవద్దని మెువ్వ పీహెచ్సీ వైద్య అధికారి శొంఠి శివరామకృష్ణరావు చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాము కరిచిన వెంటనే ఆసుపత్రికే రావాలని... నాటు వైద్యాన్ని ఆశ్రయించవద్దని కోరారు.
ఇదీ చదవండి: