వైకాపా నేతల అవినీతిని ప్రశ్నించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కారుపై దాడి దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య మండిపడ్డారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, మాజీ శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య, తంగిరాల సౌమ్య విజయవాడలో పట్టాభిరామ్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించే వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా భయపడవద్దని.. మీకు తెదేపా, మేము అండగా ఉంటామన్నారు. ఇలాంటి సమయంలోనే మనోధైర్యంతో ఉండాలని పట్టాభిరామ్కు శ్రీరాం తాతయ్య సూచించారు.
ఇదీచూడండి: