పక్క రాష్ట్రాలు కృష్ణా, గోదావరి నదుల మీద ఇష్టారీతిన అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ముఖ్యమంత్రి జగన్‌కు ఎందుకు పట్టడం లేదని... తెలుగుదేశం నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా.. జగన్ మొద్దు నిద్ర వీడటం లేదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 50శాతం వాటా ఉందని అంటున్న ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్... దిల్లీలో ప్రధాని, హోంమంత్రిని కలుస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్ర రైతుల హక్కులను తాకట్టు పెట్టే అధికారం జగన్‌కు ఎవరిచ్చారో చెప్పాలన్నారు.
కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు నిర్మించే అక్రమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని సీఎం జగన్... బెంగళూరులో తన ప్యాలెస్లు కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాడని దేవినేని ఉమ తెలిపారు. గత 28నెలల్లో పోలవరం పనులు ఎంత శాతం మేర పూర్తి చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు