కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ నాట్యాచార్యులు పసుమర్తి కేశవప్రసాద్ (71) కరోనా బారిన పడి మరణించారు. సుమారు 42 సంవత్సరాలుగా అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి కార్యదర్శిగా ఆయన వ్యవహరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న నృత్య కళాకారులను తీసుకువచ్చి కూచిపూడి నాట్య ఉత్సవాలను నిర్వహిస్తూ.. ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ప్రసాద్ మృతిపై కళాకారులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరణానికి ముందు వరకు కృష్ణా విశ్వవిద్యాలయంలో కూచిపూడి నృత్య విభాగం ప్రిన్సిపాల్‌గా ఆయన పనిచేశారు.
ఇదీ చదవండి: