ETV Bharat / state

Fake Votes in Machilipatnam: తప్పుల తడకగా బందరు ఓటర్ల జాబితా.. ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోని అధికారులు - ఏపీ తాజా వార్తలు

Fake Votes in Machilipatnam: రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో తోసేసినా.. అధికార వైసీపీకి ఎన్నికలంటే భయం లేదు.. సీపీఎస్‌ రద్దు, జాబ్‌ క్యాలెండర్‌, మద్యపాన నిషేధం వంటి కీలక హామీలు.. తుంగలో తొక్కేసినా జగన్‌ సర్కారుకు బెరుకు లేదు.. అరాచ పాలనను అంతమొందించాలని ప్రతిపక్షాల అన్నీ ఏకమవుతున్నా సీఎం ధీమాకు కారణం.. దొంగ ఓట్ల మాయాజాలం. నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ ఓట్ల కుట్రను ఇప్పుడు మరింత తీవ్రతరం చేశారు. అందుకు మరో ఉదాహరణే.. కృష్ణా జిల్లా బందరు నియోజకవర్గ ఓటరు జాబితా సవరణ తీరు.

Fake_Votes_in_Machilipatnam
Fake_Votes_in_Machilipatnam
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2023, 7:56 AM IST

Fake Votes in Machilipatnam: తప్పుల తడకలుగా బందరు ఓటర్ల జాబితా.. ఎన్నికల సంఘం ఆదేశించినా పట్టించుకోని అధికారులు

Fake Votes in Machilipatnam: ఒక బూత్‌ పరిధిలో ఓట్లు అక్కడే ఉండకపోతే ఏమైంది..? ఎక్కడో ఒక చోట ఉంది కదా..? అక్కడి కెళ్లి ఓటు హక్కు వినియోగించుకోలేరా..? అయినా వారి తరఫున మీరెందుకు వకాల్తా పుచ్చుకున్నారు..? మీ సమస్యలు ఉంటే చెప్పండి..? ఇదీ అన్ని రాజకీయ పార్టీలతో జరిగే సమావేశంలో.. ఓట్ల జంబ్లింగ్‌ గురించి ప్రశ్నించిన వారికి.. జిల్లా స్థాయి అధికారి నుంచి ఎదురైన సమాధానం. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు.. రాష్ట్రంలో ఏ స్థాయిలో ఓట్ల అవకతవకలు జరుగుతున్నాయో..!

Illegal Votes in AP: కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో.. దాదాపు ఓటరు జాబితా సవరణ పూర్తి కావస్తోంది. పోలింగ్‌ బూత్‌ల హేతుబద్దీకరణ ప్రతిపాదనలు కొలిక్కి వచ్చాయి. ఈ నెల 27న సమీకృత ఓటర్ల జాబితా ప్రచురించనున్నారు. దీనిపై మరోసారి డిసెంబరు వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. డిసెంబరు 26కు అభ్యంతరాలు పరిష్కరించి.. 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే.. సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Fake Votes in AP: వారం రోజుల్లో ఓటర్ల ముసాయిదా జాబితా.. అక్రమాలు పూర్తిగా సరిదిద్దకుండానే..!

Voters List Without Correction of Irregularities: డ్రాప్టు నోటిఫికేషన్‌ రావడానికి కొద్ది రోజులు మాత్రమే ఉన్నా.. బందరు నియోజకవర్గంలో సవరణ పూర్తి కాలేదు. ఈ విషయం ఎన్నికల సంఘం గుర్తించినా అధికారులు మాత్రం స్పందించకపోగా.. కనీస చర్యలు తీసుకోలేదు. ఇంటింటికి బీఎల్‌ఓలు తిరిగి సవరణ చేయాల్సిన ఓటర్ల జాబితా తప్పుల తడకలుగా ఉంది. వీటిని పర్యవేక్షించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదు.

TDP Votes Deletion in AP: అక్టోబరు 10న నియోజకవర్గ ఎన్నికల అధికారిగా ఉన్న మచిలీపట్నం ఇంఛార్జ్‌ ఆర్​డీఓ శివనారాయణ రెడ్డికి, బందరు ఎమ్ఆర్ఓ శ్రీవిద్యకు, కలెక్టర్‌ రాజాబాబుకు.. 24 గంటల్లో తప్పులు సరిదిద్ది నివేదిక ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. దాదాపు 2వారాలు గడిచినా తప్పులు అలాగే ఉన్నాయి. టీడీపీ సానుభూతిపరుల లక్ష్యంగా కొన్ని ఓట్లను తొలగించగా.. కొన్ని జంబ్లింగ్‌ చేశారు. ఒకే వీధిలోని ఓట్లు వేరే ప్రాంతాల్లో చేర్చారు. దీనిపై మాజీమంత్రి కొల్లు రవీంద్ర.. సీఈఓ ముఖేష్‌కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. ఓట్ల గోల్‌మాల్, జంబ్లింగ్‌పై సామాజిక కార్యకర్త ఐ.దిలీప్‌కుమార్‌.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

YCP Govt Vote Gambling: పథకం ప్రకారమే ఓట్ల జబ్లింగ్.. తప్పులున్నా సరిదిద్దని యంత్రాంగం

TDP Leaders Allegations on Voter List: గత స్థానిక సంస్థ ఎన్నికల్లో మచిలీపట్నం నగరపాలక సంస్థను దక్కించుకునేందుకు ఈ జంబ్లింగ్‌ విధానం అత్యంత ప్రణాళికాబద్ధంగా చేసినట్లు తెలిసింది. ఓటర్లను పోలింగ్‌ బూత్‌లు, డివిజన్లు మార్చడం ద్వారా ఆయా డివిజన్లలో ఉన్న ఓటర్ల జాబితా ప్రకారం ఓటరు రిజర్వేషన్‌ మారిపోయింది. పురుషుల ఓట్లను వేరే డివిజనుకు మార్చడం ద్వారా ఆ డివిజను మహిళా రిజర్వేషన్‌ అయింది. ఇలా జంబ్లింగ్‌ చేయడం ద్వారా ఒక రాజకీయ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంది. వచ్చే సాధారణ ఎన్నికలకు ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు. టీడీపీ సానుభూతి పరులు, తమ వారు కాదని తెలిసిన ఓట్లను ఇతర ప్రాంతాలకు జంబ్లింగ్‌ చేయడం లేదా తొలగించడం లాంటి ప్రక్రియ చేపట్టారు.

Vote Gambling in Krishna District: బందరు అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాలో ప్రధానంగా ఎక్కడా ఇంటినెంబర్లు క్రమపద్ధతిలో లేవు. ఒక పోలింగ్‌ కేంద్రంలో ఉండాల్సిన ఓట్లు వేరే పోలింగ్‌ కేంద్రానికి మారాయి. దీనివల్ల అక్కడ పోలింగ్‌ ఏజెంట్లు ఆ ఓటరును గుర్తించే అవకాశం లేదు. వీటిని సరిదిద్దాల్సిన అధికారులు చర్యలు తీసుకోలేదు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా విధులు నిర్వహించాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలిసింది.

YCP Govt Vote Gambling: అధికారపార్టీకి చెందిన నేత ఒత్తిడి ఉన్నట్లు తెలిసింది. ఇటీవల నియోజకవర్గానికి చెందిన ఓ సహాయ ఎన్నికల అధికారికి సస్పెండ్‌ ఉత్తర్వులు ఇచ్చిన మరుక్షణమే వాటిని ఉపసంహరించుకున్నారు. కానీ ఇది ఎక్కడా రికార్డుల్లో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నియోజకవర్గంలో తప్పుల తడకలుగా ఉన్న 24 వేల ఓట్లు సరిదిద్దామని ఎన్నికల అధికారి చెబుతున్నారు. ఇంకా 10వేల ఓట్ల వరకు జంబ్లింగ్‌లో ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

Double Votes in Macharla: మాచర్లలో అధికార పార్టీ నేతల డబుల్ ధమాకా.. 5వేల మందికి రెండేసి ఓట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.