దశలవారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు.. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరను అంచనాల కమిటీ లేదా పీయూసీకి ఛైర్మన్గా నియమిచనున్నట్లు తెలుస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతిని సాంఘిక/మహిళా సంక్షేమ కమిటీకి అధ్యక్షురాలిగా నియమించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు కూడా చైర్మన్ పదవి ఖరారైందని సమాచారం. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పదవి సంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష తెదేపాకు వెళ్లనుంది. ఇందులో వైకాపా తరఫున సభ్యులుగా ఎనిమిది మందిని ఎంపిక చేసేందుకు.. కొన్ని పేర్లను పరిశీలించినట్టు సమాచారం.
అసెంబ్లీ కమిటీలకు ఛైర్మన్లు ఎవరంటే!? - undefined
అసెంబ్లీలో వివిధ కమిటీల్లో ఛైర్మన్లను ఎంపిక చేసేందుకు కసరత్తు పూర్తయింది. మొత్తం 10 కమిటీలకు ఇద్దరు చొప్పున పేర్ల జాబితాను రూపొందించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అందజేసినట్టు తెలిసింది.