వేర్వేరు జిల్లాల్లో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు పారబోశారు.. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న నాటు సారాను ధ్వంసం చేశారు.
2400 లీటర్ల నాటు సారా ధ్వంసం..
కృష్ణా జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న 2400 నాటు సారాను మచిలీపట్నం జిల్లా పోలీస్ కార్యాలయంలో ధ్వంసం చేశారు. వీటిని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్, ఎన్ఫోర్స్మెంట్ ఏఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం..
విజయనగరం జిల్లాలోని ఉత్తరావల్లి గ్రామ శివారు ప్రాంతాల్లో చీపురుపల్లి ఎక్సైజ్ సీఐ సీహెచ్ ప్రసాద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. తయారీగా సిద్ధంగా ఉంచిన సుమారు 700 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
ఇదీ చదవండి: