కరోనాతో సహజీవనమన్న సీఎం జగన్.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మూడోసారి వాయిదా వేశారని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. కార్యక్రమం వాయిదాకు కరోనాను కారణంగా చూపడం విడ్డూరంగా పేర్కొన్నారు. ప్రక్రియలో అక్రమాల జరిగాయని సొంత పార్టీ వారే విమర్శలు చేస్తున్నారన్నారు. అయినా సీఎంకు కనువిప్పు కలగడం లేదని విమర్శించారు.
తెదేపా హయాంలో 25లక్షల ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టి, 10 లక్షలు పూర్తి చేశామని తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. "సెంటు పట్టా" పేరుతో భూముల కొనుగోలు, స్థలాల చదును, పట్టాలలో వైకాపా నాయకులు అవినీతి చేస్తున్నారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల్లో సొంతపార్టీ నేతల అవినీతిపై విచారణకు ఆదేశించగలరా అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
గత ప్రభుత్వ హయంలో ఎంపికైన గృహలబ్ధిదారులకు ఊరట... ఆ ఇళ్లు పూర్తి ఉచితం