ఏపీలో పోలీసుల పాలన నడుస్తోందని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్న మాటల్లో.. నూటికి నూరు శాతం నిజం ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అరాచక, అవినీతి పాలన సాగుతోందని తాము ఎప్పటి నుంచో చెప్తున్నామన్నారు.
పోలీసులు మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించారు. చిన్నచిన్న వాటిపై కేసులు పెడుతూ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీలో ప్రజల తిరుగుబాటు తప్పదని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇదీ చదవండి: తెదేపా సానుభూతిపరుడు నలంద కిషోర్ అరెస్ట్