పంచాయతీ ఎన్నికల రెండో దశ ఫలితాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలోని పలుచోట్ల... సర్పంచి అభ్యర్థులు అతి స్వల్ప తేడాతో గెలిచారు. గెలిచినవారు ఆనందంలో మునిగితేలుతుంటే... ఓడినవారు మన అదృష్టం ఇంతేనని సర్దిచెప్పుకుంటున్నారు.
కృష్ణా జిల్లా నందివాడ మండలం గండేపూడిలో ఒక ఓటుతో గెలిచారు. గండేపూడి సర్పంచిగా ఒక ఓటుతో కర్నాటి సత్యనారాయణ అనే అభ్యర్థి విజయం సాధించారు. పెదపారుపూడి మండలం వానపాములలో 3 ఓట్లతో గెలుపోటములు డిసైడయ్యాయి. పోతూరి రమేశ్ అనే అభ్యర్థి... వానపాముల సర్పంచిగా 3 ఓటు తేడాతో గెలిచారు. కృష్ణా జిల్లా నందివాడ మండలం పెద్దవిరివాడ సర్పంచిగా 3 ఓట్ల ఆధిక్యంతో రజిని గెలుపొందారు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గన్నేపల్లిలో ఒక ఓటుతో విజయం నమోదైంది. గన్నేపల్లి సర్పంచిగా ఒక ఓటుతో నెల్లూరు వెంకటస్వామి గెలిచారు. నాలుగుసార్లు కౌంటింగ్ చేసినా వెంకటస్వామికి ఒక ఓటు ఆధిక్యం లభించింది. చేజర్ల మండలం ఓబులాయపల్లెలో 5 ఓట్లతో కోవి రత్నమ్మ విజయం సాధించారు.
అనంతపురం జిల్లా సంజీవపురం పంచాయతీలో 7 ఓట్ల ఆధిక్యంతో విజయం ఖరారైంది. సంజీవపురం సర్పంచిగా 7 ఓట్ల ఆధిక్యంతో పవిత్ర అనే అభ్యర్థి గెలిచింది. అనంతపురం జిల్లా భోగినేపల్లి సర్పంచిగా ఒక్క ఓటుతో బండి ఉజ్జినప్ప గెలుపొందారు. పాతపాళ్యం సర్పంచిగా ఒక్క ఓటుతో పూజారి రేవతి విజయం సాధించారు.
ఇదీ చదవండీ... పల్లెపోరు: రెండో దశలో పోలింగ్ శాతం ఎంతంటే..?