ETV Bharat / state

'ఈఎస్​ఐ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలి'

ఈఎస్​ఐ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ అరెస్టుపై ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించారు. అవినీతి నిరోధక శాఖ అధికారులు రమేశ్ కుమార్ అరెస్టులో నిబంధనలు అతిక్రమించారని పిటిషనర్ తరఫు న్యాయవాది.. ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. వినిపించారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని అభ్యర్థించారు.

ap high court
ap high court
author img

By

Published : Jun 13, 2020, 7:00 PM IST

ఈఎస్​ఐ మాజీ డైరెక్టర్ రమేశ్ కుమార్ను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేయటంపై ఆయన భార్య హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. రమేశ్ కుమార్​కు అనిశా అధికారులు నోటీసు ఇవ్వకుండా... నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు చేశారని పిటిషనర్ తరుఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. అనిశా అధికారులు రమేశ్ కుమార్ అరెస్టులో నిబంధనలు అతిక్రమించారని న్యాయస్థానానికి తెలిపారు. రమేశ్ కుమార్ అరెస్టు వెనుక రాజకీయ కుట్రకోణం ఉందని... ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యర్థించారు.

అయితే... అరెస్టు ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. రమేశ్ కుమార్​ను ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించామని న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు... కేసును రెగ్యులర్ కోర్టులో వింటామని తెలిపింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.