Employees protest: ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికై ఉద్యోగులు చేపట్టిన నిరసనలు మూడో రోజుకు చేరాయి. ఉద్యోగులు విజయవాడ తహసీల్దార్ కార్యాలయంలో నిరసనకు దిగారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలనీ ఏపీ ఎన్జీవో సంఘం కృష్ణా పశ్చిమ అధ్యక్షులు విద్యాసాగర్ డిమాండ్ చేశారు. ఎక్కడ లేనివిధంగా 7 డీఏలు పెండింగ్లో ఉన్నాయని.. మెడికల్ బిల్లులు రీయింబర్స్ కాలేదన్నారు. ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించినా.. సమస్యలు మాత్రం కొలిక్కి రావడం లేదన్నారు.
గడిచిన రెండున్నరేళ్లుగా ఉద్యోగులు తమ సమస్యలపై అధికారులకు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ఉద్యోగులు ఆరోపించారు. ఉద్యోగుల్లో చీలిక తీసుకురావడానికి కొన్ని సంఘాలు దుష్ప్రచారాలు చేస్తున్నాయని.. వారిని ఎవరూ నమ్మే ప్రసక్తే లేదని ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు శోభన్ బాబు అగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
ఇదీ చదవండి