తూర్పుగోదావరి జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్‌ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ సందర్శించారు. విద్యార్థులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొదటి దిశ పోలీస్ స్టేషన్‌ను రాజమహేంద్రవరంలో ప్రారంభించనున్నట్లు డీఐజీ వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, రికార్డులను ఆయన పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సిస్టం పనితీరును డీఐజీ సమీక్షించారు.
ఇవీ చూడండి: