ETV Bharat / state

8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు - పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ

ఈ నెల 8న పరిషత్ ఎన్నికలు ముగియగానే పెండింగ్‌లో ఉన్న పురపాలక, పంచాయతీ ఎన్నికలను నెలాఖరులోగా నిర్వహించాలని ఎస్​ఈసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. పెండింగ్‌ స్థానాల వివరాలను పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల నుంచి సేకరించడంతో పాటు ఎన్నికలు జరగకపోవడానికి గల కారణాలను ఆరా తీసింది.

8న పరిషత్​కు పోలింగ్‌.. తర్వాతే మిగతా స్థానాలకు నోటిఫికేషన్లు

author img

By

Published : Apr 5, 2021, 6:07 AM IST

రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు పెండింగ్‌లో ఉన్న పురపాలక, పంచాయతీ ఎన్నికలను ఏప్రిల్ నెలాఖరులోగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. పెండింగ్‌ స్థానాల వివరాలను పంచాయతీరాజ్‌, పురపాలక శాఖల నుంచి సేకరించడంతో పాటు ఎన్నికలు జరగకపోవడానికి కారణాలను ఆరా తీసింది. ఆయా పనుల్ని పూర్తి చేయటానికి ఉన్న అవకాశాలపై మరింత సమాచారం సేకరించింది.

దశల వారీగా..

ఈనెల 8న పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ పూర్తైన వెంటనే మిగిలిన స్థానాలకు కూడా దశల వారీగా నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ఆయా చోట్ల అవరోధాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ, ఎన్నికల సంఘానికి నివేదించినట్లు సమాచారం. వాటిలో కొన్ని ప్రాంతాలు పురపాలక, నగరపాలక సంస్థల్లో విలీనమయ్యాయి.

మరికొన్ని అలా ఏర్పడ్డాయి..

ఇంకొన్ని కొత్త నగర పంచాయతీ, పురపాలక, నగర పాలక సంస్థలుగా ఏర్పడ్డాయి. వాటితో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలపై పంచాయతీరాజ్‌ శాఖ ఎన్నికల సంఘానికి మరో నివేదిక ఇవ్వనుంది. కొత్తగా ఏర్పాటైన మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థకు ఎన్నికల విషయంలో పురపాలక శాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఇవీ చూడండి

: నాపై చేసినవన్నీ నిరాధార ఆరోపణలే.. అవే వివరించా: ఏబీ వెంకటేశ్వరరావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.