ETV Bharat / state

ఇది మురికి కుంట కాదు.. దేవస్థానం భూమి! - దుర్గామల్లేశ్వర స్వామి

పచ్చగా ఉండాల్సిన దుర్గగుడి భూమి.. ఓ కార్పొరేట్ కళాశాల తీరుతో మురికి కూపంగా మారింది. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలోని 7.86 ఎకరాల సాగు భూమి.. సేద్యానికి పనికిరాకుండా పోతుంది.

మురుగుకుంటలా మారిన దుర్గ గుడి దేవస్థానం భూమి
author img

By

Published : Jul 19, 2019, 3:03 AM IST

మురుగుకుంటలా మారిన దుర్గ గుడి దేవస్థానం భూమి

పచ్చటి పొలాల మధ్యలో ఏంటీ మురికి కుంట అనుకుంటున్నారా? ఇది మురికి కుంట కాదు. ఈ పొలాన్ని ఓ కార్పోరేట్ కళాశాల ఆక్రమించి ఈ పరిస్థితికి తెచ్చింది. ఈ భూమి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన భూముల్లో ఒకటి. 7.86 ఎకరాలున్న ఈ భూమి సేద్యం చేసుకునేందుకు గతంలో ఓ రైతుకు కౌలుకు ఇచ్చారు. 20 బస్తాల ధాన్యాన్ని దేవస్థానానికి ఇచ్చేలా రెండేళ్లకు లీజుకు ఇచ్చారు. ఈ పొలం పక్కనే ఓ ప్రైవేటు కళాశాలను నిర్వహిస్తున్నారు. దుర్గమ్మ మాన్యాన్ని లీజుకు తీసుకున్న రైతు, పొలాన్ని ఆ కార్పొరేట్ కళాశాలకు సబ్ లీజుకు ఇచ్చేశాడు. చివరికి ఆ కళాశాన యాజమాన్యం.. తమ సంస్థకు సంబంధించిన మురుగు మొత్తం ఈ పొలంలోకే విడుదల చేస్తూ.. పంట భూమిని పనికిరాని భూమిగా మార్చేసింది.

3 నెలలన్నారు.. ఏం చేస్తారో మరి

ఈ సంగతి గతంలో గుడి పాలక మండలి దృష్టికి వెళ్లగా నాటి పాలక మండలి ఛైర్మన్ గౌరంగ బాబు స్వయంగా పొలాన్ని పరిశించారు. కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. అయినా ఫలితం లేదు. స్థానిక పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. ఏడాది గడిచినా వారి నుంచీ స్పందన లేదు. ఇటీవలే ఈవో కోటేశ్వరమ్మ జోక్యం చేసుకోగా... మూడు నెలల్లో పొలాన్ని శుభ్రం చేసి ఇస్తామని లిఖిత పత్రాన్ని ఇచ్చారు. మరోవైపు.. పంటభూమి మురుగు నీటితో నిండిన పరిస్థితుల్లో.. చుట్టు పక్కల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కార్పోరేట్ సంస్థలు మురుగు నీటిని పొలాల్లోకి విడుదల చేయకూడదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం పట్టించుకోకుండా కళాశాల యాజమాన్యం ఇష్టారీతిన వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు.

ఎవరూ ముందుకు రావడం లేదే...

ఈ భూమి లీజు గడువు ముగిసిన కారణంగా.. మరొకరికి ఇచ్చేందుకు దేవస్థానం యత్నిస్తోంది. కానీ మురుగు ఉన్న పరిస్థితుల్లో ఎవరూ లీజుకు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ కారణంగా... దేవస్థానానికి ఆదాయం రాకుండా పోతోంది. ఇప్పటికైనా దేవస్థానం అధికారులు పట్టించుకోకపోకతే సుమారు 10 కోట్ల రూపాయలు విలువ చేసే పొలం ఎందుకూ పనికిరాకుండా పోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Intro:AP_RJY_57_18_TDP_SAMAVESAM_AV_AP10018

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

అధికార పార్టీ నాయకులు కక్షసాధింపు చర్యలు చేపడితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఐక్యంగా ఉండి పోరాడి తిప్పికొట్టాలని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు

Body:తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం కృష్ణదేవరాయ కల్యాణమండపంలో తెదేపా నాయకులు, కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు తామంతా అండగా నిలబడతాం అన్నారు అధికార పార్టీ వారు కేవలం బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ప్రజల గురించి ఆలోచించడం లేదన్నారు గెలుపు ఓటములు తెదేపాకు కొత్త ఏమీ కాదన్నారు.

Conclusion:వైయస్ఆర్సీపీ గెలుపు ఈ వి ఎం తీర్పుగా గా గా ప్రజలు భావిస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు పూర్తయిన పాలన అంతా గందరగోళంగా ఉందన్నారు అధికారులను ఇష్టానుసారంగా మారుతున్నారన్నారు ఉన్న పథకాలను అమలు చేస్తారా లేదా అన్నది అయోమయంగా ఉందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.