రాష్ట్రంలో అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా కల్లుగీతపైనే ఆధారపడి బతుకుతున్న కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుగీత కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. కల్లును చెట్లపై నుంచి దించుకునేందుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని చెప్పారు. చెట్ల నుంచి కల్లు కుండలను దించకపోతే.. కుండల నుంచి కారిన కల్లు చెట్లపై పడుతుందన్నారు. ఫలితంగా భవిష్యత్తులో కల్లు తీసేందుకు అవకాశం లేకుండా చెట్లు నాశనమవుతాయని చెప్పారు. చెట్లకు కట్టిన కల్లు కుండలను దింపుకునేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరారు. మన రాష్ట్రం తరువాత అధిక సంఖ్యలో కల్లు గీత కార్మికులున్న కేరళలో కనీస ఆదాయం కల్పించేలా.. అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: