కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెంలో నీటితో కళకళలాడే చెరువు ఒట్టిపోయింది. కింది స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల నెల క్రితం కాలువలకు నీరు విడుదల చేసినా... చెరువు నింపడంలో వైఫల్యం చెందారు. ఇప్పుడు తాగటానికి నీరులేక గ్రామం గొంతు ఎండుతోంది. ఉన్న కొద్దిపాటి నీరు సైతం నాచుతో ఆకుపచ్చ రంగులోకి మారింది. అన్ని అవసరాలు తీర్చే చెరువు ఇంకిపోవడంతో... ప్రభావం భూగర్భజలాలపై పడింది. మూడు, నాలుగు రోజులకు ఒకసారి వచ్చే పంపు నీరు సరిపోవటంలేదు. బోరు నీటికోసం మైళ్ల దూరం నడవాల్సి వస్తుంది. టాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఎంతో మంది అధికారులను వేడుకున్నా లాభం లేదు. వీరి కష్టాలు చూసి ఎవరైనా దాతలు ముందుకు వచ్చినా... ఎన్నికల కోడ్ పేరిట ఆపేస్తున్నారు. బోర్ల నుంచి వచ్చే ఉప్పునీరు తాగి రోగాలపాలవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండీ :