ETV Bharat / state

పదేళ్లుగా వెంట్రుకలు తింటున్న బాలిక.. సర్జరీ చేసి కిలో జుట్టు తీసిన వైద్యులు

Rare surgery at Gudivada in Krishna District: కొంతమంది మట్టి, బియ్యం తింటుంటారు. కానీ దీనికి భిన్నంగా కృష్ణాజిల్లా గుడివాడలో ఓ బాలిక జట్టు తినడం అలవాటు చేసుకుంది. దీంతో వైద్యులు శస్త్ర చికిత్స చేసి.. ఆమె కడుపులో నుంచి కిలో జుట్టును బయటకు తీశారు.

Rare surgery at Gudivada
అరుదైన శస్త్ర చికిత్స
author img

By

Published : Jan 31, 2023, 3:42 PM IST

Rare surgery at Gudivada in Krishna District: సమాజంలో నిత్యం మనం అనేక చిత్ర, విచిత్రమైన సంఘటనలు చూస్తూ ఉంటాం. కొందరు సుద్ధముక్కలు, మట్టి, బియ్యం తింటూ ఉంటారు. వీటన్నింటికీ భిన్నంగా ఓ బాలిక జుట్టును తినడం అలవాటు చేసుకుంది. గత పదేళ్లుగా తన జుట్టుతో పాటు, ఇంట్లో దొరికిన కుటుంబ సభ్యుల జుట్టును తినడాన్ని బాలిక అలవాటుగా మార్చుకుంది. ఈ అలవాటు కారణంగా కడుపు నొప్పితో బాధపడుతున్న బాలికను హాస్పిటల్లో చేర్పించారు. ఆమెకు అరుదైన శస్త్ర చికిత్స చేసిన వైద్యులు, కడుపులో నుంచి కిలో జుట్టును బయటకు తీసి బాలిక ప్రాణాలు కాపాడారు.

ఈ అరుదైన శస్త్ర చికిత్స కృష్ణాజిల్లా గుడివాడ శ్రీ రామ నర్సింగ్ హోమ్​లో డాక్టర్ పొట్లూరి వంశీకృష్ణ నేతృత్వంలో జరిగింది. బాలిక పుట్టినరోజు నాడే శస్త్ర చికిత్స చేసి చిన్నారికి వైద్యులు పునర్జన్మ అందించారు. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన ట్రైకో బీజోర్ జాతి కారణంగా 20 ఏళ్ల లోపు బాలికలు జుట్టు తినడాన్ని అలవాటు చేసుకుంటారని డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. కడుపులో నుంచి కిలో జుట్టు బయటకు తీయడం వైద్యరంగ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన దాఖలాలు లేవని ఆయన అన్నారు. అరుదైన ఆపరేషన్ అనంతరం బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు తెలియజేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.