కృష్ణాజిల్లా అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో దివిసీమ లలితకళా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మండలి బుద్ధ ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంగీత విద్వాంసులు త్యాగరాజస్వామి పేరిట రాష్ట్రంలో తొలి ఆలయం అవనిగడ్డలో ఉందని ఆయన తెలిపారు. కళలు...మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని నేటి యువతకు కళల పట్ల ఆసక్తిని పెంపొందించాలని చెప్పారు. దివిసీమలో డప్పు కళాకారులు, రంగస్థల కళాకారులు ఎందరో ఉన్నారని ఆయన తెలిపారు.
దివిసీమలో పాఠశాల విద్యార్థులకు నవంబర్ 14న జరిగే బాలల దినోత్సవ కార్యక్రమం నుంచి లలితకళా సమితి ఆధ్వర్యంలో కళలపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లలితకళా సమితి నూతన కార్యవర్గం... బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు అయింది. అధ్యక్షులుగా నాటక కళాకారులు పుప్పాల వీరాంజనేయులు, ఉపాధ్యక్షులుగా కొమ్మూరి శ్రీనివాస శర్మ, ప్రధాన కార్యదర్శిగా కె.చంద్రశేఖరరావులతో పాటు మరో 8 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి