వైకాపా ఏడాది పాలనలో పగ, ప్రతీకారం తప్ప ఏమీ లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియాలతో వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. మంత్రులకు వారి శాఖలపై పట్టులేదని, ఆదాయం ఎంతనేది కూడా చెప్పలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. మంత్రివర్గ సమావేశం ఎప్పుడో కూడా చెప్పలేని స్థితిలో మంత్రులు, ప్రభుత్వం ఉందని ఉమా దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: 90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం