స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా విషయంలో సుప్రీంకోర్టు తీర్పు .. రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెదేపా నేత దేవినేని ఉమ విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి కులాన్ని ఆపాదిస్తూ మంత్రులు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచమంతా కరోనాపై అప్రమత్తంగా ఉంటే.., రాష్ట్రంలోని ఒక్క జిల్లాలోనూ ఏ ఒక్క మంత్రి కూడా సమీక్షించకపోవడం దారుణమన్నారు. విదేశాల నుంచి విశాఖ వస్తున్న విద్యార్థుల పట్ల ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి : భారత్కు పయనమైన తెలుగు విద్యార్థులు